నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరంక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపారాజు శ్రీనివాస్, కోటయ్య, సురేష్, శ్రీనివాస్ రావు, దేవేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రాజశేఖర్, అభివర్ధన్ రెడ్డి, రాజ్ కుమార్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.