నమస్తే శేరిలింగంపల్లి: రోడ్ల నిర్మాణం పనుల్లో నాణ్యత పాటించాలని, నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడేది లేదని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్, శంకర్ నగర్ కాలనీలలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్లను బుధవారం కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ అభివృద్ధికి పాటుపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ, టిఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.