నమస్తే శేరిలింగంపల్లి: సగర సంఘానికి గడ్డపార సత్యనారాయణ చేసిన సేవలు మరవలేనివని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం ప్రధాన కార్యదర్శి దివంగత గడ్డపార సత్యనారాయణ సగర మొదటి వర్ధంతిని అంజయ్య నగర్ సగర సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. గడ్డపార సత్యనారాయణ సగర చిత్రపటానికి సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ సగర మాట్లాడుతూ గడ్డపార సత్యనారాయణ సాగర్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కుల సంఘం తో పాటు యాదాద్రి సగర అన్నదాన సత్రం నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైందని కొనియాడారు. గ్రేటర్ హైదరాబాద్ లో అనేక సంఘాలను ఏర్పాటు చేసి సగర సంఘాన్ని సంఘటిత పరిచారని తెలిపారు. గడ్డపార సత్యనారాయణ సగర ఆశయాలను కొనసాగించేందుకు నేటి సగర యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొండాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గ్రేటర్ సగర సంఘం గౌరవాధ్యక్షులు అస్కాని వెంకటస్వామి సగర, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు సగర, కోశాధికారి రామస్వామి సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ నగర సంఘం, అంజయ్య నగర్ సగర సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.