మాదాపూర్ అభివృద్ధికి సహకరించండి: ప్రభుత్వ విప్ గాంధీకి మాదాపూర్ వాసుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను తప్పకుండా పరిష్కరించి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్‌ డివిజన్ పరిధిలోని మాదాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మాదాపూర్ గ్రామస్తులు ప్రభుత్వ విప్ గాంధీని కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆరెకపూడి గాంధీ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, సీసీ రోడ్ల ఏర్పాటు కు కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే కాలనీలో పర్యటించి కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్, శాస్త్రి యాదవ్, ఇంద్రసేన, మహేష్ యాదవ్, నర్సింగ్, రవి ముదిరాజు, ఈర్ల లాలూ, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీకి వినతి పత్రం అందజేస్తున్న మాదాపూర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here