నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ డివిజన్ పరిధిలోని గురునాధం చెరువు సమీపంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కొలనులో ఎప్పటికప్పుడు పేరుకుపోయిన పూలు, చెత్తాచెదారాన్ని తొలగించాలన్నారు. మియాపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్, స్థానిక నాయకులు, సిబ్బంది ఉన్నారు.