నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ రవికిరణ్ ను కోరారు. ఈ మేరకు బుధవారం జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, నవోదయ కాలనీ, గౌలిదొడ్డిలో వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని, పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జడ్ సి రవికిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.