నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అడపడచులందరికి ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ రాఖీపర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పండుగను చక్కటి వాతావరణం లో కుటుంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా, సంతోషకరంగా జరుపుకోవాలని కోరారు. రాఖీ పర్వదినం చాలా పవిత్రమైనది అని, అన్న చెల్లెల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్ష బంధన్ అని పేర్కొన్నారు. పవిత్ర ప్రేమను చాటిచెప్పే రాఖీ పౌర్ణమి పండగ అని, ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ అని అన్నారు. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ అన్నారు. అన్నంటే అమ్మలో మొదటి సగం,నాన్న లో రెండో సగమే అన్న అనే పదం, అన్నచెల్లెల అనురాగానికి గుర్తే రక్షా బంధనం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రాఖీ పండుగను విజయవంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ