నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్వాంతత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో మనమంతా భాగస్వాములవ్వడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, నాయకులు కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, బాలు, శ్రీనివాస్ ముదిరాజ్, భాస్కర్ తో పాటు అధిక సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.