ఓంకార్ నగర్ లో ఆకట్టుకున్న చోటు కే ఎడ్యుకేషన్ చిన్నారుల సైన్స్ ఫెయిర్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా చోటు కే ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ కనిపించే చిన్నారులు అందరూ చదువుకునే ఆర్థిక స్థోమత లేక వివిధ రీతిలో బాల కార్మికులుగా పనిచేస్తున్న వారిని పని ఆపించి చోటు కే ఎడ్యుకేషన్ సంస్థ చదువు చెప్పించడంతో పాటు వారిలోని విజ్ఞానాన్ని ప్రదర్శించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వినసొంపుగా అనిపించిందన్నారు. ఇలా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్న నిర్వాహకురాలు యువనేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపారు. యువత యువనేశ్వరీ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సైన్స్ ఫెయిర్ లో తమ ప్రయోగాలను ప్రదర్శిస్తున్న చిన్నారులతో పల్లె మురళి సెల్ఫి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here