నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బిజెపి హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు తో కలిసి శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరూ ఉచితంగా కరోనా టీకాలు వేయించుకునే అవకాశం కల్పించారన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు మోడీ ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చయినా దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించడమే తన లక్ష్యమని ప్రధాని ప్రకటించడం ఆయన ఆయన ఉదార స్వభావతకు నిదర్శనం అని అన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చి కేంద్రం అందించే ఉచిత వ్యాక్సిన్ ను తీసుకుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్ ను తప్పకుండా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, రవి గౌడ్, వర ప్రసాద్,ఆకుల లక్ష్మణ్, యాదగిరి, అంజయ్య, సుబ్బారావు, లక్ష్మణ్, సాయి కిరణ్, శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.