నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట వీకర్ సెక్షన్ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మొబైల్ వాక్సినేషన్ డాక్టర్ రమణి తో మాట్లాడి సెంటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి భౌతిక దూరం పాటిస్తూ వాక్సినేషన్ సజావుగా జరిగేలా చూడాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేసి వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి కాలనీలో మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాలని వాసులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.