నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడా లోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియను బుధవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వాళ్లకు మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాక్సిన్ ను స్థానికంగా ఉన్న కమిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, స్కూళ్లలో అందుబాటులో ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు దూరం వెళ్లకుండా ప్రజలకు చేరువగా అనేక సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి ఒక్కో మొబైల్ సెంటర్ ద్వారా రోజుకి 350 నుంచి 400 మందికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ సెంటర్ లు ఉంటాయని, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఆధార్ వివరాలు తెలిపి వాక్సిన్ వేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మీన్ లాల్ , శ్రీ రాములు, శివ సింగ్, దేవేందర్ రెడ్డి, సంతోష్ సింగ్, గోపాల్, బబ్లూ సింగ్ , తదితరులు పాల్గొన్నారు.