నమస్తే శేరిలింగంపల్లి: మల విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చందానగర్ ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం గంగారం కు చెందిన నిర్మల (45) గత కొద్ది రోజులుగా మతి స్థిమితం లేకుండా ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత మల విసర్జన కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిర్మల తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కుటుంబీకులు చుట్టు పక్కల వెతికినా జాడ లేకపోవడంతో బుధవారం నిర్మల కుమారుడు సరలా వరప్రసాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన 9491039027, 790113092, 8008029073, 9490617100,100 నంబర్లకు సమాచారం అందించగలరని ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపారు.