గచ్చిబౌలి స్టేడియంను ఆధునీకరించాలని కేంద్రాన్ని కోరిన చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలోని హైదరాబాద్ లో రెండు దశాబ్దాల క్రితం 90 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని, ఒలంపిక్స్ నిర్వహించగల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాలని, ఇందుకు రూ.52 కోట్లు కేటాయించాలని చేవెళ్ళ లోక్ సభ సభ్యుడు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్ సభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత జీరో అవర్ లో నోటీస్ ఇచ్చారు. దేశంలోని ప్రముఖ స్టేడియాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ కి అనువైన అన్ని సదుపాయాలు ఉన్నాయని, హాకీకి రెండు కోర్టులున్నాయని, ఈ స్టేడియంలో నిర్వహించిన అనేక క్రీడోత్సవాలలో, 32వ జాతీయ క్రీడలు, ఆఫ్రో అసియన్ గేమ్స్, వాల్డ్ మిలిటరీ గేమ్స్ కొన్ని అని ఎంపీ చెప్పారు. ఈ స్టేడియంలో మౌలిక సదుపాయాలను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ కార్యదర్శి రూ.52 కోట్ల అంచనాలతో కూడి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించారని చెప్పారు. ఇటీవల టోక్యో( జపాన్ ) ఒలంపిక్స్ లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఒలంపిక్ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి, అవసరమైతే ఒలంపిక్స్ నిర్వహించడానికి అనువుగా అన్ని సదుపాయాలతో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ స్టేడియంలో చిన్న తనం నుండి టెన్నిస్ క్రీడాకారిణి పి.వి సింధు టెన్నిస్ క్రీడా శిక్షణ చేస్తూ ఉండేదని అయన గుర్తు చేశారు. అనంతరం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ని కలిసి, ఈ మేరకు సాధ్యమైనంత త్వరితగతిన నిర్ణీత నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం గురించి లోక్ సభ లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి ప్రస్తావించడం పట్ల గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

గచ్చిబౌలి స్టేడియం

 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here