చందాన‌గ‌ర్‌లో ఘనంగా యువజన‌ కాంగ్రెస్ ఆవిర్భావ ది‌నోత్సవ వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంప‌ల్లిలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘ‌నంగా జ‌రిగాయి. యూత్ కాంగ్రెస్ నాయకులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో చందానగర్ కాప్రీ స‌ర్కిల్ వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో యూత్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు మైపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంప‌ల్లి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ జి. రఘునందన్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు జెరిపేటి జైపాల్‌లు ముఖ్య అతిథిలుగా హాజ‌రై కేక్ క‌ట్ చేసి సంబురాలు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి యూత్ కాంగ్రెస్ పార్టీ పాత్ర మ‌రిచిపోలేనిద‌ని అన్నారు. గ‌ల్లీ నుంచి డిల్లీ వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి యువ‌జ‌న కాంగ్రెస్ చేస్తున్న కృషి అద్వితీయ‌మ‌ని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ‌వైభ‌వ స్థితి రాగానే యువ నాయ‌క‌త్వానికి త‌గిన గుర్తింపు దక్కుతుంద‌ని ఆశాబావం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు ఇలియాస్ షరీఫ్, జావేద్, శ్రీహరి, దుర్గేష్, దుర్గాదాస్ , భాయ్, ఖాజా, మెహరాజ్ ఖాన్, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here