చందానగర్ డివిజన్ భవనిపురం కాలనీ నుండి అమీన్ పూర్ 150 ft లింక్ రోడ్ సమస్యను ఈ. ఈ చిన్న రెడ్డి మరియు ACP సంపాత్ లతో కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కొన్ని వందల వాహనదారులు ఈ రోడ్ గుండా ప్రయాణం చేస్తారని, రోడ్డు లేక వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాలం నుండి ఈ సమస్య పరిష్కారమవుతేే సుమారు 15 కాలనీల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. భూమి యజమానులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించి రోడ్ వేయటం పూర్తి చేయాలని అధికారులను నవత రెడ్డి కోరారు.