నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రెండవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఇందులో భాగంగా శుక్రవారం నల్లగండ్లలో, గచ్చిబౌలి స్టేడియం వద్ద హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డిలు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో పట్టణ ప్రగతిని ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఉప కమిషనర్ తేజావత్ వెంకన్న, ఏఎంఓహెచ్ డాక్టర్ రవి కుమార్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా, ఏఈ కృష్ణ వేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, శానిటరీ ఇన్స్పెక్టర్ జలందర్ రెడ్డి, నాయకులు వసంత్ కుమార్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లికార్జున్ యాదవ్, గిరి, రాజి రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీశైలం, రంగస్వామి, రమేష్, శివ గౌడ్, శివ, మునుర్ సాయి, శ్రీనివాస్, శ్రీకాంత్, మల్లేష్, రవి చందర్, జిహెచ్ఎంసి సూపర్వైజర్ భారత్, తదితరులు పాల్గొన్నారు.