నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ లో ఉపాది లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జానపద కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని సామాజిక సేవారత్న అవార్డు గ్రహీత, భేరి వెంకటమ్మ, వెంకటయ్య మెమోరియల్ ట్రస్టు చైర్మెన్ భేరిరామ్చందర్యాదవ్ అన్నారు. సోమవారం బుర్రకథ గానం చేసే బుడగ జంగాలు కళ్లెం మాసయ్య, అనంతమ్మలకు ట్రస్టు తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రామ్చందర్యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ఎంతోమంది జానపద కళాకారులు తినడానికి తిండి సైతం లభించని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు దాతలు, ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.