నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడ ఖర్చు చేయకుండా కేంద్రమే వాక్సిన్ కొనుగోలు చేసి 18 సంహాత్సరాలు దాటిన వారందరికీ ఉచితంగా టీకాలు అందిస్తుందని ప్రకటించిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయులని బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ పేర్కొన్నారు. దేశప్రజల ఆరోగ్యం గురించి మోదీ ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తుందో ఈ నిర్ణయం అద్దం పడుతుందని ఆయన అన్నారు. ఇది దేశ హితం కోసం ప్రియతమ ప్రధాని తీసుకున్న చారిత్రక నిర్ణయమని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23 కొట్లాదిమందికి ఉచిత వాక్సీన్ ఇవ్వడం జరిగిందని, ఇకపై 18 ఏళ్ళు పైబడ్డ వారందరికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత వాక్సిన్ ఇవ్వాలని ప్రధాని ప్రకటించడం గర్వకారణమని అన్నారు. ఇటు అరోగ్యం రక్షణతో పాటు దేశంలోని నిరుపేదల ఆహార భద్రతపైనా ప్రధాని మోడి దృష్టి సారించడం ఆయన పారిపాలన దక్షతకు నిదర్శనం అన్నారు. భారత్‌ను కరోనా రహిత దేశంగా చూడలాన్న మోడి లక్షం తొందరగ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రధానిపై అవాకులు చవాకులు పేల్చే ప్రతిపక్షాలు నోరు మూసుకోవాలని హితవు పలికారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధానికి సహకరించకపోయినా పరువాలేదు కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని సూచించారు.