శేరిలింగంప‌ల్లిలో ఘ‌నంగా మంత్రి హ‌రీష్ రావు జ‌న్మ‌దినం… టీపీయూఎస్ ఆద్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని సత్యభారతి కన్వెన్షన్ హాల్‌లో గురువారం తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ఆధ్వర్యంలో గురువారం ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మెద‌క్‌ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు అలా వెంకటేశ్వర రెడ్డి, ఎస్.సి.ఎస్.టి కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బాలింగ్‌ గౌతమ్ గౌడ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి తిరుపతి రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులు సాయిచంద్‌ల‌తో కలిసి ప్ర‌భుత్వ విప్‌, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ ప్రారంభించారు. అనంతం కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

ర‌క్త‌దాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, ఎంపి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జ‌నార్ధ‌న్ రెడ్డి, వెంక‌టేశ్వ‌ర్‌రావు, నిర్వాహ‌కులు గంధం రాములు త‌దిత‌రులు

ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా కోవిడ్ నిబంధనలకు లోబడి టీపీయూఎస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం తగ్గిపోతుండడంతో తలసేమియా, ఇతరత్రా వ్యాధిగ్రస్తులకు ఈ రక్తం ఉపయోగపడుతుందని అన్నారు. దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని వారిని కొనియాడారు. ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవ సమయంలో, అనారోగ్యం పాలైనప్పుడు రక్తం అవసరం చాలా ఉంటుందన్నారు. రక్తదానం చేయడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉన్న వారు ఎన్ని సార్లు రక్తదానం చేసినా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఎవరు కూడా భయపడకుండా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన టీపీయూఎస్‌ ఆధ్యక్షులు గంధం రాములుని గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పురుషోత్తం యాదవ్, నాయ‌కులు ప్రవీణ్ గుప్త, గంగాధర్ రావు, రామ కృష్ణ, భాస్కర్, మహిళ అధ్యక్షురాలు ప్రభా రెడ్డి, పద్మావతి, గోపరాజు శ్రీనివాస్, రవి, సుధామ, పరుషరాం, జకీర్, మల్లేష్ గౌడ్, చంద్ర శేకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here