నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విజృంభనతో తెలంగాణలో పరిస్థితి రోజురోజుకు గంభీరంగ మారుతుందని, ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర పోతునట్టు కనిపిస్తుందని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ఒక ప్రకటన పేర్కొన్నారు. విపత్కర పరిస్థుల్లో తెలంగాణ ప్రభుత్వం పేదలను విస్మరించిందని కేరళ ప్రభుత్వం తరహా ప్రతి పేద వాడికి నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనాతో తల్లి, తండ్రులు కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు తగ్గకుండా ఆర్థిక సహాయం ప్రకటించాలని అర్హులైన పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తమ ఫెడరేషన్ ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నాట్టు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కింది అంశాలపై దృష్టి పెట్టాలి…
• తెలంగాణలో 100 మందికి కరోనా టెస్ట్ చేస్తే 20 మందికి పాజిటివ్ వస్తుంది అంటే నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 20 శాతం మంది కరోనా బారిన పడుతున్నారు
• ప్రభుత్వం 80 లక్షల మందికి వైద్యం అందించే విధంగా సంసిద్ధంగా ఉండాలి
• కొన్ని పేపర్లలో మరియు ఆన్లైన్ మాధ్యమాలలో ఉన్న లెక్కల ప్రకారం రెండు శాతం మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడుతుంది అంటున్నారు.
• 80 లక్షల కేసులలో రెండు శాతం రోగులు అంటే 160,000 మందికి ఆక్సిజన్ బెడ్స్ లేక విలలాలడుతున్నారు.
• ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో కలిపి కేవలం 38 వేల బెడ్లు మాత్రమే ఉన్నాయని అంచనా..
• ఈ క్రమంలో సుమారు 130,000 అత్యవసర బెడ్లు ఇప్పుడు తెలంగాణకు అవసరము వీటిని వెనువెంటనే యుద్ద ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలి..
• జిల్లా, మండల, స్థాయిలో ఉన్న హాస్పిటల్లో ఇప్పుడున్న బెడ్స్ కి 10% పెంచాలి. ఇందుకోసం ఒక వార్ రూమ్ ఏర్పాటు చెయ్యాలి.
• ఈ వార్ రూమ్ హెల్త్ సెక్రెటరీ అద్వ్యర్యంలో నడవాలి. జిల్లాల్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయ్, ఎన్ని బెడ్స్ ఉన్నాయ్, ఎంత మంది రోగులున్నారు, ఎంత మంది ఇబ్బంది పడ్తున్నరు, ఎక్కడ ఆక్సజన్ కొరత ఉంది అని ఈ వార్ రూమ్ నుండి పర్యవేక్షించాలి.
• ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటలో ఎన్ని బెడ్స్ ఖాలీ అవుతున్నాయి అవన్నీ ప్రజలకు తెలిసే విధంగా ఒక వెబ్ సైట్ లో పెట్టాలి.
• గొప్ప రాష్ట్రంగా ప్రకటించుకునే మన తెలంగాణలో ఒక్క ఆక్సిజన్ యూనిట్ కూడా లేకపోవడం బాధాకరం కావున వెనువెంటనే హైదరాబాదులో 5 యూనిట్లు మరియు జిల్లా కి ఒకటి చొప్పున యూనిట్లు ఏర్పాటు చేయాలి.
• ముఖ్యంగా ఇవన్నిటిని పర్యవేక్షించడం కొరకు ఆరోగ్యశాఖ మంత్రిని నియమించాలి
• జిల్లా స్థాయి ఆసుపత్రిలో అత్యవసర ఆక్సిజన్ బెడ్స్ 20% పెంచాలి జిల్లా, మండల, స్థాయి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో పని చేస్తే పెద్ద హాస్పిటలలో తాకిడి తగ్గుతుంది తద్వరా ప్రైవేట్ ఆసుపత్రుల అకృత్యాలను అడ్డు కట్ట వేయొచ్చు.
• జిల్లా, మండల, స్థాయి ఆసుపత్రులు పై చెప్పిన విధంగా పని చెయ్యాలి అంటే కావలసిన అంత మందికి తగ్గకుండా వైద్య సిబ్బందిని వీలైన పద్ధతులలో నియమించుకోవాలి.
• ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రెండింతల జీతం ఇవ్వాలి.
• ప్రభుత్వ ఆసుపత్రులు పనితీరు పర్యవేక్షించిట మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే అకృత్యాలను అరికట్టడ్డం కొరకు జిల్లాకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నీ నియమించాలి.
• రాష్ట్ర రాజదాని లో ఉన్న ఉస్మానియా, గాంధీ , నిమ్స్, మరియు ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్ పర్యవేక్షించుటకు ఒక్కో హాస్పిటల్కి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారి నీ నియమించాలి.
• కొవిడ్ పరీక్షలు నామ మాత్రంగా నే చేస్తున్నారు 24 గంటలు పరీక్షలు చేసే విధంగా వ్యవస్థను ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలి.
• కేబినెట్ లేదా విద్య శాఖ అధికారులు కూర్చొని ప్రైవేట్ హాస్పిటల్ లో టెస్ట్ నుండి అతవ్యవసర బెడ్డు ప్రతీది కులకుషంగా ఒక దర నిర్ణయించాలి దానికి మించి వసులు చేసిన హాస్పటల్ లను ప్రభుత్వం అదినం లో తీసుకుంటాం అని హుక్కూం జారీ చెయ్యాలి.
• ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటినీ అధీనం లోకి తిస్కోవాలి.
• కరోనా భారిన పడి యువకులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి వాక్సిన్ వెయ్యాలి అని జీఓ పాస్ చెయ్యాలి
• వాక్సిన్ ప్రక్రియ వీలైనంత ఎక్కువ జరిగే విధంగా చర్య తీసుకోవాలి దీనికి గాను స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్లును కూడా వాడుకోవాలి.
• రాష్ట్ర వ్యాపితంగా ఒక టాస్క్ఫోర్స్ టీమ్ నీ ఏర్పాటు చేసి రిమిడిసెవర్ మరియు ఇతర కరోనా మందులతో బ్లాక్ దందా చేస్తున్న వారిని అరికట్టాలి
• ఇంకో 15 రోజులు నిర్భందం పెట్టి ఉద్యోగం కోల్పోయిన వారికి 5000 వారి ఖాతాలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. పేద వాడు ఆకలితో నిద్రపోకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాలి.
• నిధులు సరిపోవు అనుకుంటే ఎం.పి, ఎమ్మెల్యే లనిధులు వారి జీతాలు అడిగి తీసుకొని ఇంకా అవసరం పడితే రైతు బంధు దనిక రైతులకు అపి ఆ నిధులు పేద ప్రజల సంక్షేమం కోసం వాడాలి..
• సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలో పడుతున్న ప్రతి రూపాయి ఎటుపోతుందో ప్రజల ముందు పెట్టాలి.
• ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల పనులు పక్కన పెట్టి ప్రతి పేదవాడి ప్రాణం కాపాడే విధంగా ప్రభుత్వం పని చెయ్యాలి.
-పల్లె మురళి
ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
Nice
Super advices… Keep going