నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధలోని న్యూ కాలనీలో సోమవారం స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాలనీలోని వదర ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో రోడ్లపై నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా తొలగింప చేశారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి మాట్లాడుతూ ప్రజలు దైర్యంగా ఉండాలని, ఎలాంటి సమస్య తలెత్తిన తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే స్పందించి తోచిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డుమెంబర్ వరలక్ష్మీ, ఎస్ఆర్‌పీ కనకరాజు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.