నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం లాక్‌డౌన్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆరవ రోజు లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, ఖాజాగూడ చౌరస్థాలలో వాహనాలను పరిశీలించారు. లాక్‌డౌన్ నిబంధనలకు పాటిస్తున్నారా..? ట్రాఫిక్ ఆంక్షలు ఫాలో అవుతున్నారా..? నాణ్యమైన హెల్మెట్లు వాడుతున్నారా..? లాంటి అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలు మినిహా మిగిలిన వారు అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్‌రావు, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.