నమస్తే శేరిలింగంపల్లి: కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ మంత్రి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి సోమవారం ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీతో కలిసి కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌ను సందర్శించనున్నారు. కోవిడ్ రోగులకు అక్కడ కొనసాగుతన్న చికిత్స, కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ తీరును ఆమె పరిశీలించనున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరు కావద్ధని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.