రాజీవ్‌న‌గ‌ర్‌, అర‌వ బ‌స్తీల్లో క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు… ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని గోపన్‌ప‌ల్లి గ్రామంలోని రాజీవ్ నగర్,, అర‌వ బ‌స్తీల్లో క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా శుక్ర‌వారం డీఆర్ఎఫ్ బృందం శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలో స్థానిక కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి డ్రైవ్‌లో పాల్గొని రెండు ప్రాంతాల్లో అడుగడుగునా క‌రోనా క్రిమి సంసంహారక మందులను పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, స్వీయ నియంత్ర‌ణ‌తోనే క‌రోనా క‌ట్ట‌డి సాధ్య‌మ‌ని అన్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు, డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

క‌రోనా క్రిమి సంహర‌క మందుల‌ను పిచికారి చేయిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here