దీప్తీశ్రీన‌గ‌ర్‌, శంక‌ర్‌న‌గ‌ర్‌ల‌లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయించిన డివిజ‌న్ టీఆర్ఎస్ అధ్య‌క్షుడు ర‌ఘునాథ్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి దీప్తి శ్రీ నగర్, శంకర్ నగర్ కాల‌నీలలో బుద‌వారం రాత్రి సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహ్మమరి నియంత్రణకు ప‌టిష్ట‌మైన చర్యలు చేపట్టిందని అన్నారు. ప్ర‌భుత్వ విప్‌ అరికెపుడి గాంధీ, ప్రభుత్వ వైద్య అధికారులతో కరోనా నియంత్రణకు తిసుకోవలసిన చర్యలపై ఎప్ప‌టిక‌ప్పుడు చర్చిస్తూ త‌గిన సూచ‌న‌లు చేస్తున్నార‌ని అన్నారు. ప్రజలు అపోహలు చెంది భయాందోళనకు గురికావోద్దని, అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతెనే బయటికి రావాలని సూచించారు. విధిగా మాస్కలు ధరించాలని, త‌ర‌చూ చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు. నలబై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోని వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

డీఆర్ఎఫ్ సిబ్బందిచే సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయిస్తున్న‌ డివిజ‌న్ టీఆర్ఎస్ అధ్య‌క్షుడు ర‌ఘునాథ్‌రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here