నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ గురువారం మసీద్‌బండ ప్రభుపాద లేఅవుట్లో పర్యటించారు. గత కొంత కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో సమస్యను రవికుమార్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కాలనీలో పర్యటించిన రవికుమార్ యాదవ్ సమస్య తీవ్రతను అర్ధం చేసుకుని సంబంధిత అధకారులతో మాట్లాడారు. సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని వారికి సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ప్రజల సమస్యలు పట్టడం లేదని, ప్రజా సమస్యల విషయంలో సకాలంలో స్పిందించక పోతే ఎంతటి పోరాటానికైనా సిద్దమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎల్లేష్, అరుణ్ యాదవ్, యాదగిరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






