నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు మక్త మహబూబ్‌పేట్ గ్రామానికి చెందిన పులిపలుపుల రాజేష్ గౌడ్ జన్మదిన వేడుకలు బుదవారం ఘనంగా జరిగాయి. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొడిచెర్ల టి కృష్ణ ఆద్వర్యంలో మియాపూర్‌లోని కష్టజీవుల సంఘటన కార్యాలయంలో రాజేష్ గౌడ్‌ను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజేష్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుడిని వేడుకుంటున్నట్టు టి కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీధర్‌ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, కృష్ణగౌడ్, రమేష్, అంజిబాబు తదితరులు పాల్గొని రాజేష్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






