ప్ర‌భుత్వ‌విప్ గాంధీతో స‌మావేశ‌మైన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి… నాన‌క్‌రామ్‌గూడ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి డివిజ‌న్ కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్‌రెడ్డి నాన‌క్‌రామ్‌గూడ వాసుల‌తో క‌ల‌సి బుద‌వారం ప్ర‌భుత్వ విప్‌, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. నానక్‌రామ్‌గూడ‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లు, డ్రైనేజిలు దెబ్బతిని ఇళ్లలోకి మురుగునీరు చేరి గ్రామ‌స్థులు ఇక్కట్లు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో గ్రామంలో కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజి లైన్ వెంటనే మంజూరు చేయాలనీ గాంధీని కోరారు. సానుకూలంగా స్పందించిన గాంధీ వెంటనే జోనల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి నానక్రామ్గూడలోని సమస్యలని పరిష్కరించేలా చర్యలు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నానక్రామ్గూడ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ గాంధీకి స‌మ‌స్య‌ను వివ‌రిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, నాన‌క్‌రామ్‌గూడ వాసులు

జోన‌ల్‌క‌మిష‌న‌ర్‌కు స‌మ‌స్య తీవ్ర‌త‌ను వివ‌రించిన కార్పొరేట‌ర్‌…
జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌ను క‌లిసిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి నాన‌క్‌రామ్‌గూడ వాసుల అవ‌స్థ‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. త్వ‌రితగ‌తిన స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూడాల‌ని కోరారు. అదేవిధంగా గోప‌న్‌ప‌ల్లి తండాలోని స‌మ‌స్య‌ల‌ను సైతం ప‌రిష్క‌రించాల‌ని కోరారు. స్పందిన జ‌డ్సీ ర‌వికిర‌ణ్ స‌మ‌స్య‌ను ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. ఈ క్ర‌మంలోనే ఏఈ కృష్ణవేణి బృదంకు స‌మ‌స్య తీవ్ర‌త అర్ధ‌మయ్యేలా కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి ద‌గ్గ‌రుండి స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను చూపించారు.

జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, నాన‌క్‌రామ్ గూడ పెద్ద‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here