నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్‌క్లేవ్‌లో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ బుదవారం పర్యటించారు. కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందిచే కాలనీలోని ప్రతి వీధిలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలు పకడ్భందిగా చేపడుతున్నదని, ఐతే వైరస్ కట్టడికి ప్రజల స్వీయ నియంత్రణ ఎంతో ముఖ్యమని అన్నారు. అందరు విధిగా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్‌పీ కనకరాజు, కాలనీ పెద్దలు ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






