పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ మియాపూర్‌, హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్‌ల‌లో బిజెపి నిర‌స‌న‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: పశ్చిమ బెంగాల్‌లో బిజెపి కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రిగిన దాడుల‌ను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇచ్చిన పిలిపు మేర‌కు మియాపూర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు మానిక్‌రావు ఆద్వ‌ర్యంలో ఆర్‌బీఆర్ అపార్ట్‌మెంట్స్ వ‌ద్ద‌, హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ అద్య‌క్షుడు శ్రీధ‌ర్‌రావు ఆద్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర నాయ‌కులు జ్ఞానేంద్ర ప్ర‌సాద్‌, క‌లివేముల మ‌నోహ‌ర్‌లు మాట్లాడుతూ 3 స్థాన‌ల నుంచి 77 స్థాన‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ పాగా వేయ‌డాన్ని జీర్ణించుకోలేక టీఎంసీ అధినేత మ‌మ‌త దాడుల‌కు దిగ‌డం హేయ‌మైన చ‌ర్య అని అన్నారు. ప్ర‌జాస్వామ్య యుతంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ గెలుపుకోసం కృషి చేసిన కార్య‌క‌ర్త‌ల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డం, మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డ‌టం క్ష‌మించ‌రాని నేర‌మ‌ని అన్నారు. అందుకు త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వర ప్రసాద్, కోటేశ్వరరావు, ర‌వి గౌడ్, నారాయ‌ణ‌రెడ్డి, చంద్ర‌మోహ‌న్‌, ఆకుల లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, విజేంధర్, శ్రీధర్ రెడ్డి, అంజయ్య, ప్రసాద్, శివ, నాగరాజు, రవి, మల్లేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆల్విన్ చౌర‌స్థా వ‌ద్ద నిర‌స‌న తెలుపుతున్న నాయ‌కులు జ్ఞ‌నేంద్ర ప్ర‌సాద్‌, శ్రీధ‌ర్‌రావు, వ‌ర‌ప్ర‌సాద్‌, కోటేశ్వ‌ర్‌రావు, ర‌విగౌడ్‌
మియాపూర్ వ‌ద్ద నిర‌స‌న తెలుపుతున్న క‌లివేముల మ‌నోహ‌ర్‌, మానిక్‌రావు, నారాయ‌ణ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here