నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనిలో చేపడుతున్న వరద నీటి కాలువ నిర్మా పనులను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిలు మంగళవారం పరిశీలించారు. నాల పనులను వర్షాకాలం వచ్చేసరికి పూర్తి చేయాలని అధికారులను గాంధీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, వార్షాకాలం వచ్చేలోగా నాలా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. వరదలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ శ్రీకాంతీ, డీఈ రుపదేవి, ఏఈ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.






