క‌రోన క‌ష్ట‌కాలంలో అపోలో వినూత్న ప్ర‌యోగం… డ్రైవ్ ఇన్ కరోన టెస్ట్ సెంట‌ర్ ఏర్పాటు‌… కార్‌లో నుంచే న‌మూనాల సేక‌ర‌ణ‌…

  • మాదాపూర్ మెరీడియ‌న్ స్కూల్‌లో మొద‌టి శాఖ ప్రారంభం…
  • ప్ర‌తి రోజు 250 మందికి ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అపోలో సంస్థ వినూత్న సేవ‌ల‌కు తెర‌లేపారు. హైద‌రాబాద్‌లో మొట్ట‌మొద‌టి సారి కోవిడ్ డ్రైవ్‌ ఇన్ క‌రోనా టెస్ట్ సెంట‌ర్‌ల‌ను ప్రారంభిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మాదాపూర్ మెరిడియ‌న్ స్కూల్‌లో మొద‌టి ఈ డ్రైవ్ ఇన్ క‌రోనా టెస్ట్ సెంట‌ర్‌ను శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ కేంద్రానికి వ‌చ్చిన వారికి కార్‌లోనే నుంచే వారి న‌మూనాల‌ను సేక‌రిస్తారు. ఈ కేంద్రాల ద్వారా రోజూ 250 మంది పేషెంట్ల వరకూ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవ‌చ్చు. త‌ద్వారా చికిత్స‌కు ఎంతో ఉప‌యోగ ప‌డుతుంది.

మాదాపూర్ మెరీడియ‌న్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన మొద‌టి అపోలో డ్రైవ్ ఇన్ క‌రోనా టెస్ట్ సెంట‌ర్ ఇదే

క‌రోన ప‌రీక్ష‌ల కోసం అనుస‌రించాల్సిన తీరు ఇలా…

  • పరీక్షా కేంద్రానికి వచ్చే వారు తమ నమోదు కార్యక్రమాన్ని మొబైల్ లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా చేసిన వెంటనే వారి మొబైల్ లో టోకెన్ అందుకోవడం జరుగుతుంది.
  • టోకెన్ అందుకొన్న తర్వాత పరీక్ష చేయించుకోదలచిన వారు తగిన రుసుము ఆన్ లైన్ లోనే చెల్లించి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
  • టోకెన్ నెంబర్ ఆధారంగా ఫెల్భొటోమిస్టు (పరీక్ష నిర్వహించే నిపుణులు) నమూనాలను సేకరిస్తారు.
  • నమూనాను సేకరించిన వెంటనే పరీక్ష చేయించుకొన్న వారి మొబైల్ లో వివరములతో పాటూ బిల్లు కూడా మెసేజ్ ద్వారా అందుతాయి.
  • పరీక్షకు వచ్చే వారు తమతో పాటూ ప్రభుత్వం పేర్కొన్న విధంగా తగిన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ) ను తమ వెంట తెచ్చుకోవాలి.
  • పరీక్షానంతరం అపోలో డయాగ్నస్టిక్స్ వారు 48-72 గంటలలోగా రిపోర్టును ఆన్ లైన్ లోనే అందించడం జరుగుతుంది.
కార్‌లో నుంచె న‌మూనాలు సేక‌రిస్తున్న అపోలో సిబ్బంది

ఈ ప్రక్రియ అంతా మానవ రహితంగా మొత్తం ఆన్ లైన్ లోనే సాగుతుంది. రానున్న రోజులలో అపోలో డయాగ్నస్టిక్స్ వారు హైదరాబాదులో ఇలాంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త పరీక్షా కేంద్రాల వివరాలను ఎప్పటికపుడు ఆపోలో డయాగ్నస్టిక్స్ వారి వెబ్ సైట్ www.apollodiagnostics.inలో ఉంచడం జరుగుతుంది. ఈ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం అపోలో డయాగ్నస్టిక్ కస్టమర్ కేర్ వారిని 040-44442424 లో సంప్రదించగలరు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here