నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ రెండవ దశ విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరుతూ పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసింది. పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చెన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పాతూరీ సుధాకర్ రెడ్డిలు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలసి వినతీ పత్రం అందజేశారు. కాగా సానుకూలంగా స్పందించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఈ నెల 27 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నయ్య, పాతూరి సుధాకర్‌రెడ్డిలు మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.