నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీలో జిహెచ్ఎంసి పారిశుధ్య సిబ్బందితో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో డివిజన్లో శానిటైజేషన్ స్పేషల్ డ్రైవ్‌కు ఉప్పలపాటి పిలుపునిచ్చారు. ప్రతి బస్తీ, కాలనీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడ చెత్త నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని తమ విధులు నిర్వహించాలని, ప్రజల్లో బరోసా కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీలు తిప్పర్తి మహేష్, కనక రాజు, ఎస్ఎఫ్ఏలు నాగరాజు, గురుచరణ్, నాగరాజు గౌడ్, వినయ్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.