నమస్తే శేరిలింగంపల్లి: మతి స్థిమితంగా లేని ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ రెడ్డి కాలనీలో ప్లాట్ నెంబర్ 66లో నివాసం ఉండే ఆరీఫా భేగం(28)కు గత కొన్నేళ్లుగా మతి స్థిమితంగా లేక ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలోనే ఆమె తల్లి ఆరీఫాకు ఆయూర్వేద వైద్యం కోసం ఈనెల 2వ తేదిన ఉదయం 8 గంటలకు చందానగర్ వెంకటేశ్వర కాలనీ వచ్చింది. వైద్యం చేయించుకోని తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో బంధువులు కనిపించడంతో తల్లి వారితో మాట్లాడుతుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటు వెళ్లి అదృశ్యమైంది. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారివద్ద ఆరాతీసినా ఆరీఫా జాడ తెలియక పోవడంతో చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరీఫా 5.5 అడుగుల ఎత్తు ఉంటుందని, అదృశ్యమైనప్పుడు బురుఖా ధరించి ఉందని, ఆమె ఆచూకీ తెలిసిన వారు 100 నెంబర్కు గాని ఫోన్ నెంబర్ 040 27853911, 27853408, 7901113092, 9989639494లలో సమాచారం అందించాలని ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.