నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీ, ఎంఏనగర్, కృషినగర్‌లలోని డ్రైనేజీ సమస్యలను చందానగర్ సర్కిల్ డీఈతో కలసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శనివారం పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల తీరును కాలనీవాసులు కార్పొరేటర్, డీఈలకు వివరించారు. స్పందించిన కార్పొరేటర్ ఉప్పలపాటి వెంటనే సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను దూరం చేయాలని డీఈ సూచించారు. ప్రాధాన్యత క్రమంలో మూడుకాలనీల్లోని సమస్యలను పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని డీఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్క్ఇన్సెపెక్టర్ జగన్, మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చంద్రికప్రసాద్ గౌడ్, మహిళ అధ్యక్షురాలు రోజా కలిదిండి స్థానికులు అశోక్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.