రోడ్డుపై గుంత కార‌ణంగా వెన్నెముక‌కు గాయ‌మయ్యింద‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

  • భాద్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హెచ్ఆర్‌సీని ఆశ్ర‌యించిన సామాజిక కార్య‌క‌ర్త
  • చందాన‌గ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు నోటీసు జారీ చేసిన మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్‌కు చెందిన సామాజిక కార్య‌క‌ర్త వంగ‌ల విన‌య్ 2020 డిసెంబ‌ర్ 3 న‌ ఉద‌యం 8.30 గంట‌ల ప్రాంతంలో త‌న ద్విచ‌క్ర‌వాహ‌నంపై మియాపూర్ నుంచి బిహెచ్ఈఎల్ వైపు వెళుతున్నాడు. గంగారం వ‌ద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా ఉన్న ఓ గుంతలో బైక్ ప‌డి అత‌డి వెన్నెముక‌కు గాయ‌మైంది. దీంతో చికిత్స తీసుకున్న అనంత‌రం డిసెంబ‌ర్ 6న విన‌య్ మియాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ర‌హ‌దారి ప‌ర్య‌వేక్ష‌ణ లోపం వ‌ల్లే త‌న‌కు గాయ‌మ‌య్యింద‌ని అందుకు భాద్యులైన‌ సంబంధిత అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. కాగా ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోకి వ‌స్తుందంటు మియాపూర్ పోలీసులు ఫిర్యాదును చందాన‌గ‌ర్‌కు పీఎస్‌కు బ‌దిలీ చేశారు.

వంగ‌ల విన‌య్ వెన్నెముక గాయానికి కార‌ణ‌మైన గంగారంలోని రొడ్డుకు అడ్డంగా ఉన్న గుంత ఇదే

నా జీవ‌న హ‌క్కుకు భంగం క‌లిగింది: వంగ‌ల విన‌య్
త‌న ఫిర్యాదుపై చందాన‌గ‌ర్ పోలీసుల నుంచి ఆశించిన‌ స్పంద‌న రాలేదంటు జ‌న‌వ‌రి 2న విన‌య్ తెలంగాణ రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ -21 ప్రకారం త‌న‌ జీవన హక్కుకు భంగం క‌లిగిందంటు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో స్పందించిన క‌మిష‌న్ చందాన‌గ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు శుక్ర‌వారం నోటీసులు జారిచేసింది. విన‌య్ చేసిన ఫిర్యాదులోని స‌మ‌స్య‌ ఏ శాఖ ప‌రిధిలోకి వ‌స్తుంది..? భాద్యుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారా..? లాంటి పూర్తి వివ‌రాల‌తో జూన్ 21న ఉద‌యం 11 గంట‌ల‌కు క‌మిష‌న్ ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా వంగ‌ల విన‌య్ మాట్లాడుతూ న‌గ‌రంలో రోడ్లు ఎక్క‌డికక్క‌డ దెబ్బ‌తిని వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, గుంత‌ల కార‌ణంగా ప‌లువురు మృతి చెందిన సంఘ‌ట‌నలు ఉన్నాయ‌న్నారు. సంబంధిత అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల సామాన్యుల‌ ఆరోగ్యం దెబ్బ‌తిని, ఆర్దికంగా న‌ష్ట‌పోవ‌డంతో పాటు విలువైన స‌మ‌యం వృదా అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైన భాద్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆయ‌న డిమాండ్ చేశాడు.

చందాన‌గ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు మాన‌వ హ‌క్కుల కమిషన్ జారీ చేసిన నోటీసు ఇదే

‌‌

Advertisement

1 COMMENT

  1. ప్రజపతినిలు, మున్సిపాలిటీ అధికారులు ఏమీ తెస్తున్నారు గాడిదలు కస్తున్నారా ప్రజల కష్టాలు విళ్ళకు పట్టవా అలంటప్పుడు విళ్ళు ఏందుకు ఉన్నంటు. వెంటనే విరీమిద చర్యలు తీసుకోవాలని కోరుతూన్నము.కోర్టుకు మూడు నెలలు అవసరమా ఆలోచించండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here