నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో బిజెవైఎం ఆధ్వర్యంలో కోవిడ్ టీకా నమోదు సహాయక కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ ప్రజలకు కోవిడ్ టీకా నమోదు చేసుకోవడంలో సహాయం చేసేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ కోవిడ్ టీకా వేయించుకుని కరోనా వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిజెపి, బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ నమోదు సహాయక కేంద్రాన్ని ప్రారంభిస్తున్న యోగానంద్





