నమస్తే శేరిలింగంపల్లి: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అసంపూర్తిగా ఉన్న నాలాల విస్తరణ పనులను వేగవంగం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించారు. మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ నాల విస్తరణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ నాల విస్తరణ లో భాగంగా మిగిలిపోయిన అసంపూర్తి నాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, రామకృష్ణ నగర్ లోని యశోద పెరల్ సమీపంలో, సత్యనారాయణ ఎనక్లేవ్ వద్ద నాల విస్తరణ పనులను వేగవంతం చేయాలనీ, వరద నీరు ప్రవహించే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అదేవిదంగా పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా ఈ మధ్య కురిసిన వర్షాలతో చెరువుల మధ్యలో ఉన్న నాళాల ద్వారా ఒక చెరువు నుండి మరొక చెరువుకు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అవరోధాలు లేకుండా నాళాలను అభివృద్ధి చేసే ప్రత్యేక ప్రణాలికను తీసుకోవాలని సూచించారు. చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ఇ చిన్నారెడ్డి, DE రూప దేవి, AE అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ తెరాస నాయకులు వాలా హరీష్ తదితరులు పాల్గొన్నారు.






