వెంకటేశ్వర నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఓర్సు వెంకటేశ్వర్లు

చందాన‌గ‌ర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర న‌గ‌ర్ కాల‌నీ అసోసియేష‌న్ నూత‌న అధ్య‌క్షుడిగా కాల‌నీకి చెందిన ఓర్సు వెంక‌టేశ్వ‌ర్లు నియ‌మితుల‌య్యారు. ఆదివారం కాల‌నీలో నిర్వ‌హించిన స‌మావేశంలో అసోసియేష‌న్ స‌భ్యులు, కాల‌నీవాసులు నూత‌న క‌మిటీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేష‌న్ ఉపాధ్యక్షులుగా పి.వి. మహేష్, నాగ కృష్ణ ప్రధానకార్యదర్శిగా వై.సుబ్బారావు, కోశాధికారిగా ఆర్‌. రాజశేఖరరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా దత్తాత్రేయ, వెంకట్ రావు, సాయిబాబా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ రావు అడ్వజరీకమిటీ సభ్యులుగా సదానందం, శేఖర్ రావు మరియు కమిటీ సభ్యులుగా రాకేశ్, మన్మోహన్ కుమార్ , అంతయ్య, రవీందర్ రెడ్డి, యాదగిరి, చిదానంద, జంగయ్య, పాండు లను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. కాల‌నీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ అధికారుల స‌హ‌కారంతో అభివృద్దికి కృషి చేస్తాన‌ని వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. త‌న‌ను అధ్య‌క్షుడిగా ఎన్నుకున్న కాల‌నీ సంక్షేమ సంఘం స‌భ్యులు, కాల‌నీ వాసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

నూత‌నంగా నియామ‌క‌మైన కాల‌నీ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో అధ్య‌క్షుడు ఓర్సు వెంకటేశ్వర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here