- సోమ సాహిత్ జన్మదినం సందర్భంగా నల్లగండ్లలో మహిళలకు చీరల పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి: లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హాప్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమలను మరింత విస్తృతం చేయనునన్నట్లు క్లబ్ అధ్యక్షుడు కొండ విజయ్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ సభ్యుడు సోమ నాగరాజు కుమారుడు సాహిత్ జన్మదినం పురస్కరించుకొని శనివారం నల్లగండ్ల డిఫెన్స్ కాలనీలో నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. తమ లయన్స్ క్లబ్‌లోని సభ్యుల పుట్టిన రోజు వేళ విధిగా సేవా కార్యక్రమలు చేయాలని తీర్మానించుకున్నట్టు క్లబ్ అధ్యక్షుడు కొండ విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మారం వెంకట్, కోశాధికారి గాలి కృష్ణ, సభ్యులు రెడ్డి ప్రవీణ్ రెడ్డి, భీమ్ రావు, రాజీ రెడ్డి, మల్లేష్ యాదవ్ బర్క, రషీద్, బుచ్చి తదితరులు పాల్గొన్నారు.






