మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం సాయంత్రం ఆంపి థియేటర్లో తాండవం ది స్కూల్ ఆఫ్ డాన్స్ గురువు మనోజ్ఞ రెడ్డి శిష్యబృందం నృత్య ప్రదర్శనతో అలరించారు. మూషిక వాహన, వినాయక స్తుతి, అన్నమాచార్య కీర్తనలు, శివ స్తుతి, అర్ధనారీశ్వరం, స్వాగత నృత్యం, సరస్వతి స్తుతి, దుర్గ తరంగం మొదలైన అంశాలను ఖుషి, లాస్య రెడ్డి, కీర్తి, భావన , కార్తీక , లాలస, మోక్ష మొదలైన కళాకారులు ప్రదర్శించి మెప్పించారు. నృత్య ప్రదర్శనకు ముఖ్య అతిధులుగా హాజరైన రంజని, డాక్టర్ పవన్ కుమార్, రాధా కృష్ణ లు చిన్నారులను ఆశీర్వదించారు.






