
నమస్తే శేరిలింగంపల్లి: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొండా వెంకట రంగారెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ ఫైనల్ శుక్రవారం జరిగింది. టోర్నమెంట్ విజేతగా శివన్న, పవన్ బాయ్స్ నిలవగా, రెండవ స్థానంలో తిరుపతి టీం నిలిచారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.20 వేల నగదు, ద్వితీయ బహుమతిగా రూ. 10 వేల నగదుతో పాటు ట్రోఫీలను ముగింపు వేడుకలకు ముఖ్య అథితులుగా హాజరైన శివకుమార్,ఎల్. వెంకట రెడ్డి పటేల్ ల చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కొండా విశ్వేశ్వర రెడ్డి అభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.





