
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): ముకేష్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. వెంకటరెడ్డి కుమారుడు ముకేష్‌రెడ్డి ఏడవ వర్థంతిని పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలకు మంగళవారం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి విటమిన్ మాత్రలను పంపిణీ చేయడం జరిగింది. టిఆర్‌పిఎస్ ఆర్ఎంపి వైద్యుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డా. వెంకట్ రెడ్డి చేతుల మీదుగా స్థానిక నల్లగండ్ల హుడా లే అవుట్‌లోని సుమారు నాలుగు వందల రోజువారీ వలస కూలీ కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్టీ విటమిన్ టాబ్లెట్లు, మాస్కులు, పండ్లతోపాటు చిన్న పిల్లలకు సిరప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 22వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విపత్తు సమయాల్లో సేవలు కూడా అందించనున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని నియోజకవర్గాలకు తమ సేవలను విస్తరించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు జ్యోతి, మనీష్ రెడ్డి, మరియు వైద్థ్యులు వహిద్, రఫిక్, ఆంజనేయులు, రామరాజు, వి.యాన్. చారి, గోవింద రాజులు,శివశంకర్, జైస్వాల్ సునీత,ప్రభావతి, కిరణ్మయి, అరుణలు పాల్గొన్నారు.





