శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ తుల్జా భవాని ఆలయం వెనుక కాలనీలో మంజీరా పైపులైన్ లో నీరు కలుషితం అయి వస్తుందని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జలమండలి జీఎం రాజశేఖర్‌కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం వినతిపత్రం అందజేశారు. అలాగే ఆదర్శ్ నగర్ లో నెలకొన్న నీటి కాలుష్యంపై కూడా జీఎంకు ఆయన వివరించారు. నూతనంగా పైప్‌లైన్‌ను నిర్మించాలని కోరారు. నెహ్రూ నగర్ లో కొనసాగుతున్న పైపు లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీఆర్ కృష్ణారెడ్డి, ఎం.మల్లేష్, ప్రకాష్ చారి, బి.అర్జున్ రావు, కృష్ణగౌడ్, ఎస్.వెంకటేష్, ఎం.నాగేశ్వరరావు, భీమ్ రెడ్డి పాల్గొన్నారు.






