మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. సోమవారం మియాపూర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన డివిజన్ బీజేపీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు వ్యూహ రచన చేసి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి సూచనల మేరకు శేరిలింగంపల్లిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. శేరిలింగంపల్లిని బీజేపీకి అడ్డాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






