రామమందిర విరాళాల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి: డీఎస్ఆర్‌కే ప్ర‌సాద్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రామమందిర విరాళాల సేకరణ పేరిట‌ రాముడి పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తుంది అనడం అవివేకం అని బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్య‌క్షుడు డిఎస్ఆర్కె ప్రసాద్ అన్నారు. హిందువులుగా మన ఆలోచన విధానం ఉండాలి కానీ రాజకీయ కోణంలో ఆలోచించడం మనకి, భావితరాలకు మంచిది కాదని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా వాటిని సమర్ధించడం మంచిది కాదని హితవు పలికారు. అన్ని మతాలవారు, ప్రాంతాల వారు అయోధ్య రామాలయ నిర్మాణానికి నిధిని సమర్పిస్తుంటే రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, దాని ద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుంద‌నుకోవడం అవివేకం అని అన్నారు. రామమందిర విరాళాల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాల‌ని అన్నారు.

డీఎస్ఆర్‌కే ప్ర‌సాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here