ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ డైరెక్టర్ భద్రా రెడ్డి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సూర్య ప్రకాష్, ఉమా దేవి, అజయ్, సనా ఇర్ఫాన్, క్యాంప్ ఇంచార్జిలు జి.వేణు, ఎండీ మహమూద్, రవికిరణ్, ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వార్డు మెంబర్ కాశీనాథ్ యాదవ్, బిసి సెల్ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, ఏరియా కమిటీ సభ్యులు శౌకత్ అలీ మున్నా, రాములు గౌడ్, బాలస్వామి, వాసు అగర్వాస్, మౌలానా, రిపోర్టర్ రవి కుమార్, దేవేందర్, మీసాల జానయ్య, కటిక రవి, గుడ్ల శ్రీనివాస్, గుంతమళ్ల గిరి, నిమ్మగల్ల అర్జున్, అంకిడి సతీష్, యాదగిరి, సాయి గౌడ్, సంగమేశ్, వెంకట్ నాయక్, ఖాజా, ఖైసర్, మల్లేష్, నాగరాజు, ఇంత్యాజ్, రాము, రాజు పాల్గొన్నారు.