శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని గోపినగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య భవ్య రామమందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ బాగ్ సహ కార్యవాహ యాదగిరి, నిధి సేకరణ ప్రముఖ్ రవీందర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి గల అడ్డంకులన్నీ తొలగిపోయాయన్నారు.
హిందువుల ఆత్మ గౌరవ ప్రతీకగా మారనున్న రామ మందిర నిర్మాణంలో దేశంలోని ప్రతీ హిందువు పాలు పంచుకునేలా చేయాలనే ఉద్దేశంతోనే రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైందవ బంధువులందరూ మందిర నిర్మాణానికి విరాళాలను అందించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో రామ సేవకులు గోపీనాథన్ పిళ్లై, రమణీయమ్మ, చంద్రమోహన్, శ్రీనివాస్ చారి, చంద్రశేఖర శాస్త్రి, శ్రీకాంత్ గౌడ్, సత్య కురుమ, శివశంకర్, జయశంకర్, మహేష్ గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.